కత్తి మహేశ్‌ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. నేను సేఫ్..!

Friday, February 14th, 2020, 07:42:30 PM IST

సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌కి మరో ఎదురు దెబ్బ తగిలింది. నేడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసేందుకు ఐ మ్యాక్స్ థియేటర్‌కి వెళ్ళిన కత్తి మహేశ్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో కత్తి మహేశ్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కత్తి మహేశ్‌పై దాడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే గత కొద్ది రోజులుగా శ్రీరాముడిపై కత్తిమహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగానే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దాడి ఘటనపై స్పందించిన కత్తి మహేశ్ నేను బాగానే ఉన్నానని, నాకు ఏమీ కాలేదని అభిమానులకు ఫేస్‌బుక్ ద్వారా తెలియచేశాడు.