మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో నిర్మించిన ఉప్పెన సినిమా ఎన్నో అంచనాల మధ్య ఈ ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర రికార్డులను కొల్లగొడుతుంది. మొదటి రోజే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఏకంగా 9.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని రికార్డ్ ను నమోదు చేసింది. దీంతో డెబ్యూ హీరోల పరంగా ఆల్ టైం రికార్డ్ ను వైష్ణవ్ తేజ్ నమోదు చేసుకున్నాడు.
అయితే తాజాగా ఈ సినిమా మరో ఎపిక్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇండియాలో డెబ్యూ హీరోల పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా రికార్డ్‌ను కూడా ఇప్పుడు బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. దాదాపు 21 ఏళ్ల క్రితం హిందీ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా పరిచయమైన కహో నా ప్యార్ హే సినిమా అప్పట్లో 41 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. 21 ఏళ్ల క్రితం నమోదు అయిన రికార్డ్ ను ఇప్పుడు ఉప్పెన సినిమా బద్దలుకొట్టింది. ఉప్పెన సినిమా 5 రోజుల్లోనే 42 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని, 31 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని ఇండియాలో సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసుకుంది.