`ఆయ‌న రొమాన్స్ ఇండ‌స్ట్రీలో ఓపెన్ సీక్రెట్`

Monday, October 22nd, 2018, 11:49:25 PM IST

త‌మిళ స్టార్ లిరిసిస్ట్ వైర‌ముత్తుపై గాయ‌ని చిన్మ‌యి మీటూ వేదిక‌గా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. పెద్ద మ‌నిషి రూపంలో ఉండి, మేక‌వ‌న్నె పులిలా త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని చిన్మ‌యి ఆరోపించారు. త‌న‌తో పాటే ప‌లువురు గాయ‌నీమ‌ణులు ఈ విష‌యంలో కోర‌స్‌గా ఫిర్యాదులు చేయ‌డం సంచ‌లన‌మైంది. అయితే వైరముత్తు త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద జెంటిల్‌మేన్ కావ‌డంతో ఎవ‌రూ దానిపై అస‌లు స్పందించేందుకే ఇష్ట‌ప‌డ‌లేదు. ఆ క్ర‌మంలోనే చిన్మ‌యి తాను ఒంట‌రిగా అయినా పోరాడేందుకే నిశ్చ‌యించుకున్నాన‌ని అన్నారు.

అదంతా అటుంచితే వైర‌ముత్తు గురించి, చిన్మ‌యి గురించి.. స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్ సోద‌రి రెహానా ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `ఆయ‌న రొమాన్స్ ఇండ‌స్ట్రీలో ఓపెన్ సీక్రెట్`. అది అంద‌రికీ తెలిసిన వ్య‌వ‌హారం. చిన్మ‌యి పోరాటం స‌రైనదే కాద‌న‌ను. కానీ ఇలా ప‌దిహేనేళ్ల త‌ర్వాత ఇప్ప‌టికి గుర్తుకొచ్చిందా? అంటూ నిల‌దీశారు. స‌మ‌స్య మొద‌లైన‌ప్పుడే దానిని మొగ్గ‌లోనే తుంచేయ‌కుండా ఇంత‌దాకా ఎందుకు తెచ్చుకున్న‌ట్టు? అని చీవాట్లు వేశారు. వైర‌ముత్తుపై ఆరోప‌ణ‌లు విని ఏ.ఆర్‌.రెహ‌మాన్ సైతం షాక‌య్యార‌ని, దీనిపై త‌న‌ని ఫోన్ చేసి అడిగార‌ని తెలిపారు. వైర‌ముత్తు గురించి ఇంత‌కుముందే నాకు ఎంద‌రో చెప్పారు. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న బ‌హిరంగంగా అంద‌రికీ తెలుసు. అయితే నా వ‌ర‌కూ నా విష‌యంలో ఆయ‌న ఎంతో హుందాగానే వ్య‌వ‌హ‌రించారు. ప‌లుమార్లు ఆయ‌న‌తో మీటింగుల్లో పాల్గొన్నాను. అందుకే నేను త‌న‌పై ఫిర్యాదు చేయ‌లేను. అది త‌గ‌దు కూడా.. అని రెహానా తెలిపారు. అన్ని చేసినా వైర‌ముత్తును చిన్మ‌యి పెళ్లికి ఎందుకు పిలిచింది? ఆశీస్సులు ఎందుకు తీసుకుంది? ఇంత‌ యాక్టింగ్ అవ‌స‌ర‌మా? అంటూ చిన్మ‌యిపై చెణుకులు వేశారు రెహానా. మొత్తానికి వైర‌ముత్తుకి కాస్తంత రిలీఫ్‌నిచ్చారు మ్యాడ‌మ్.

  •  
  •  
  •  
  •  

Comments