పవన్ “వకీల్ సాబ్” పై పెరుగుతున్న అంచనాలు..!

Sunday, February 28th, 2021, 05:50:36 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన ఉగాది పండుగ ను పురస్కరించుకొని విడుదల కి సిద్దం కానుంది. అయితే ఈ చిత్రం పై ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియా లో, ఫిలిం నగర్ లో చెక్కర్లు కొడుతుంది. కరోనా లాక్ డౌన్ కొనసాగుతుండగా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు భారీ అమౌంట్ తో అమెజాన్ సంస్థ ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్ ఓటిటి విడుదల చేయబోమని దిల్ రాజు మరియు బోని కపూర్ లు వెల్లడించారు. అయితే ఇప్పుడు అదే అమెజాన్ ఇప్పుడు భారీ అమౌంట్ తో వకీల్ సాబ్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం విడుదల అయిన 50 రోజుల తర్వాత ఓటిటీ విడుదల చేయాలనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

అయితే మే నెలాఖరు లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఓటిటి లో రానుంది. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు. చివరగా వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తన సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాతలు సైతం పవన్ డేట్స్ కోసం ఎగబడుతున్నారు. మరొక పక్క పవన్ అయ్యప్పనం కొశియం చిత్రం రీమేక్ లో నటిస్తూనే, క్రిష్ దర్శకత్వంలో మరొక చిత్రం చేస్తున్నారు. అనంతరం గబ్బర్ సింగ్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. పవన్ వరుస సినిమాలు చేస్తుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వకీల్ సాబ్ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.