వకీల్ సాబ్ నుంచి మరో సాంగ్.. సాయంత్రం 3 గంటలకు..!

Tuesday, April 6th, 2021, 01:11:52 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. అయితే ఏప్రిల్‌ 9న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా నుంచి మగువ మగువ, సత్యమేవ జయతే , కంటి పాప అనే మూడు పాటలకు మంచి స్పందన లభించింది.

అయితే రేపు ఈ సినిమా నుంచి మరో పాట రాబోతుంది. “కదులు కదులు” అనే పాటను నేడు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో ఓ మహిళ ఫోటోను పవన్ తన చేత్తో పట్టుకుని ఉన్నట్టు పోస్టర్‌లో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అనన్య, అంజలి, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటిస్తుండగా శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.