“వకీల్ సాబ్” రిలీజ్ ఆ నెలలో నమ్మొచ్చా?

Saturday, May 23rd, 2020, 10:25:47 PM IST

ఈపాటికి పరిస్థితులు అన్ని బాగుండి ఉంటే థియేటట్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్ తో హోరెత్తుతూ ఉండేది. చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ పింక్ రీమేక్ గా “వకీల్ సాబ్” చిత్రంలో నటిస్తుండడంతో ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

దీనితో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పాత రోజులు రాబోతున్నాయి అని ఎంతగానో ఈ మే నెల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో కరోనా వచ్చి షాకిచ్చింది. దీనితో ఇంకా కొంచెం షూటింగ్ మిగిలి ఉండగానే ఈ చిత్రం ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగష్టు నెలలో విడుదల అయ్యే సూచనలు ఉన్నాయని బజ్ వినిపిస్తుంది.

ఇందులో ఎంత వరకు నిజముందో కానీ అప్పుడు విడుదల అయ్యే ఛాన్స్ లు తప్పకుండ లేకపోలేవని చెప్పాలి. ఎందుకంటే ఎలాగో ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతన్నాయి. ఇప్పటికే 80 శాతం షూటింగ్స్ అయ్యాయి. దర్శకుడు శ్రీరామ్ వేణు కూడా ఇప్పటి ఫుటేజ్ నే చాలా త్వరగా తీశారు. సో జూన్ లో షూటింగ్ మొదలు పెట్టినా ఆగష్టు కల్లా అయ్యిపోయి ఆ నెల ఆఖరున విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పాలి.