వాల్మీకిలో ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో వరుణ్ ఇరగదీసాడట..!

Tuesday, September 17th, 2019, 12:10:59 AM IST

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి సినిమా ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. అయితే ఈ సినిమాలో వరుణ్ తేక్ క్యారెక్టర్‌ని కాస్త డిఫరెంట్‌గా చూపించారు దర్శకుడు హరీశ్ శంకర్. అయితే నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయింది. అయితే రిలీజ్‌కి సమయం దగ్గరపడుతున్న తరుణంలో సినిమా టైటిల్‌ను మార్చాలని రామాయణం రాసిన వాల్మీకీ పేరును ఒక గాంగ్‌స్టర్ సినిమాకు పెట్టడాన్ని బోయ కులస్థులు తప్పు పడుతున్నారు.

అయితే ఈ వివాదాన్ని పక్కన పెడితే సినిమాలో వరుణ్ తేజ్‌ని కాస్త డిఫరెంట్‌గా చూపించామని ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో వరుణ్ తేజ్ ఇరగదీసాడని అన్నారు. ఈ సినిమాతో మేము ఎప్పుడు కలిసినా కూడా మేమిద్దరం గర్వపడేలా వాల్మీకి ఉంటుందని అన్నారు. సినిమా కోసం 85 రోజులు షూట్ చేస్తే ఆ రోజులన్నిటిలో వరుణ్ తేజ్ నవ్వుతూనే ఉండేవాడని ఆలా నవ్వుతూ చేసిన తన మొదటి హీరో వరుణ్ అని ప్రశంసలు కురిపించాడు.