అజ్ఞాతంలోకి … వంగవీటి నిర్మాత !!

Wednesday, December 28th, 2016, 12:15:24 AM IST

vangaveeti
వివాదాస్పద దర్శకుడు వర్మ రూపొందించిన తాజా చిత్రం ”వంగవీటి”, ఇప్పటికే పలు వివాదాలను రేపుతోంది. ఓ వైపు విమర్శలు, మరో వైపు వివాదాలతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమాలోని వంగవీటి రంగ గురించి తక్కువ చేసి చూపించారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రంగ తరపు వారు వర్మ పై గట్టిగానే ఫైర్ అవుతున్నారు. వారికీ ఎదురుగా వర్మ కూడా కౌంటర్లు వేయడంతో ఈ వివాదం ఇంకాస్త హీటెక్కింది. ఈ సినిమా విడుదల తరువాత ఈ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాత్రం ఈ సినిమా విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఇక వివాదాలు ఎక్కువ అవుతాయని అనుకున్నాడో ఏమో ఈ నిర్మాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినట్టు సమాచారం. ఈ నిర్మాత కనీసం ఫోన్ లో కూడా లభించడం లేదట. మొత్తానికి వర్మ ఇచ్చిన వంగవీటి స్ట్రోక్ కు దాసరి కిరణ్ కుమార్ వ్యవహారం ఇలా తయారైంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి ?

  •  
  •  
  •  
  •  

Comments