ప్రపంచంలో ఎనిమిదో వింత .. తిరుమలకు వర్మ ?

Friday, October 19th, 2018, 09:45:50 AM IST

ఏంటి ఇప్పటివరకు ప్రపంచ ఏడూ వింతలు గురించి మీరు విన్నారు .. చూసి ఉంటారు కూడా .. కానీ ఈ రోజు ఎనిమిదో వింత జరగనుంది !! ఏమిటా ? ఎనిమిదో వింత అంటే .. పలు వివాదాలతో సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువగా ఇమేజ్ తెచ్చుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు ? ఏంటి నమ్మడం లేదా ఇది నిజం నిన్ననే వర్మ సోషల్ మీడియా లో దీనికి సంబంధించిని పోస్ట్ పెట్టారు .. నాస్తికుడైన నేను రేపు తిరుమలను సందర్శించుకోనున్నాను .. నా జీవితంలో మొదటి సారి తిరుమలకు వెళుతున్నా .. ఆ తరువాత లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాకు సంబందించిన వివరాలు తిరుపతిలో తెలియచేస్తా అంటూ కామెంట్ పెట్టాడు. అన్నట్టుగానే ఈ రోజు అయన తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు .. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రకటన ఇస్తాడట ? ఇప్పటికే లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో నెగిటివ్ టాక్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా పక్కా లక్ష్మి పార్వతి కోణంలో ఉంటుందని .. ముక్యంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందంటూప్రచారం జరుగుతుంది. మరో వైపు అచ్చు ఎన్టీఆర్ లా ఉండే వ్యక్తికోసం అన్వేషిస్తున్నాడు వర్మ !!

  •  
  •  
  •  
  •  

Comments