నితిన్ కు షాక్ ఇచ్చిన మెగా హీరో ?

Sunday, September 18th, 2016, 07:33:43 PM IST

varun-tej-nithin
ఇటీవలే ”అ..ఆ” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ మళ్ళీ తన జోరు పెంచేందుకు సిద్ధం అయ్యాడు. ‘అ..ఆ’ తరువాత స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు, ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏ సినిమా చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడు, ఇక ఇదివరకే నితిన్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు? కథలో కొన్ని మార్పులు కూడా చేసాడట కానీ ఇప్పుడెందుకు ఆ సినిమా చేయడంలేదట నితిన్ ? దాంతో ఆ దర్శకుడు మరో హీరోకి షిఫ్ట్ అయ్యాడు ? ప్రస్తుతం ‘ఫిదా’ సినిమాలో నటిస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ కి కొండా కథ చెప్పాడని, వరుణ్ కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. మొత్తానికి నితిన్ కోసం రెడీ చేసుకున్న కథ వరుణ్ కి నచ్చడంతో .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఈ విషయంలో నితిన్ కి మెగా హీరో ఝలక్ ఇచ్చాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల, శ్రీను వైట్ల సినిమాలు చేస్తున్న వరుణ్ ఇలా మరో సినిమాకు కమిట్ అవ్వడంతో అందరు షాక్ అవుతున్నారు.