వైరల్ న్యూస్: నానికి పోటీగా ఫిలిం ఇండస్ట్రీలో వరుణ్ తేజ్

Monday, October 21st, 2019, 12:23:55 PM IST

గద్దలకొండ గణేష్ చిత్రం తో మాంచి ఊపుమీద వున్న వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ పెంచాడని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఫిదా, f2 లాంటి భారీ విజయాల్ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలతో డీసెంట్ హిట్ లని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతానికి వరుణ్ తేజ్ తో ఒక కమర్షియల్ చిత్రం నిర్మిస్తే దాదాపు 25 నుండి 30 కోట్లు రాబట్టొచ్చనే స్ట్రాటెజీలో ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు. అయితే దానికి తగ్గట్లుగానే వరుణ్ తేజ్ 8 కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు వరుణ్ చిత్రాలు అంతరిక్షం వంటి చిత్రం మినహా మిగతా చిత్రాలు ప్రేక్షక ఆదరణ పొందడం లో సఫలం అవ్వడమే కాకా కలెక్షన్లు కూడా రాబట్టే పరిస్థితి వుంది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మినిమమ్ గ్యారంటీ హీరో అంటే ఇప్పటివరకు నాని అనే చెప్పాలి. నాని సినిమాకి 8 నుండి 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ప్లాప్ టాక్ తెచ్చుకున్న గ్యాంగ్ లీడర్ వంటి చిత్రానికి సైతం కలెక్షన్లు రాబట్టడం లో నాని పాత్ర అమోఘం. రెమ్యూనరేషన్ విషయం లో ఇపుడు నానికి పోటీగా ఫిలిం ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ పేరు వినబడుతుంది. అయితే కలెక్షన్లు రాబట్టడమే సినిమా హిట్టా, ఫట్టా అనేది డిసైడ్ చేస్తుంది. వరుణ్ తేజ్ సినిమాల్లో నిలకడగా రాణిస్తున్నా, అంతరిక్షం వంటి చిత్రం కలెక్షన్లు రాబట్టడం లో విఫలం అయ్యింది. సినిమాలో లాభాలు తీసుకొనే ట్రెండ్ కూడా ఇటీవలే మొదలయ్యింది, మరి ఆ పద్దతిని ఫాలో అయితే వరుణ్ కి, నిర్మాతలకి ఇద్దరికీ మంచిదే. మరి వరుణ్ పారితోషికం విషయం లో ఒక మెట్టు దిగుతాడో, లేదంటే నిర్మాతలే వరుణ్ మాటకి కట్టుబడి వుంటారో వేచి చూడాలి.