నేను కాపీ కొట్టింది ఆయన్నే – నిజం చెప్పేసిన మెగా ప్రిన్స్

Thursday, September 19th, 2019, 02:19:10 AM IST

కొణిదెల కుటుంబం నుండి వచ్చినటువంటి మరొక హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పూజ హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. కాగా మరికొద్ది గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ప్రస్తుతానికి ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ చిత్ర హీరో వరుణ్ తేజ్, ఒక ప్రైవేట్ మీడియా షనల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబందించిన కొన్ని నిజాలని వెల్లడించారు.

కాగా ఈ చిత్రంలో తానూ ఆలా మాస్ లుక్ లో కనిపించడానికి కారణం మాత్రం తన పెద్దనాన్న చిరంజీవి గారని, చిరంజీవిగారి మొదటి సినిమా పునాదిరాళ్ళు చిత్రంలో చిరంజీవి గారి వేషధారణని ఆదర్శంగా తీసుకోని వాల్మికీలో ఆలా కనిపించానని, తన పెద్దనాన్నని కాపీ కొట్టానని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన మొదటిసినిమా చిత్రాన్ని స్వయంగా చిరంజీవిగారు తనకి పంపించారని వరుణ్ తేజ్ చెప్పుకొస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన వరుణ్ మాస్ లుక్, మరియు నటన, హావభావాలు మాస్ ఆడియన్స్ నుండి చక్కటి ఆదరణ లభించింది. కాగా ఈ వాల్మీకి చిత్రంతో వరుణ్ మాస్ హీరోగా మంచి పేరు తెచుకుంటాడని ఇప్పటికే ప్రముఖులు అందరు చర్చించుకుంటున్నారు.