ఇరువురు భామ‌ల‌తో రొమాన్స్‌, కానీ పాట‌ల్లేవ్‌!!

Thursday, March 1st, 2018, 12:10:17 AM IST

వ‌రుణ్‌తేజ్ కెరీర్ ప్ర‌స్తుతం స్వింగులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఫిదా, తొలి ప్రేమ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్లు సాధించాయి. ఈ రెండు సినిమాల‌తో వ‌రుణ్ మార్కెట్ రేంజు డ‌బుల్ అయ్యింద‌ని ట్రేడ్‌లో టాక్‌ న‌డుస్తోంది. కేవ‌లం ఓవ‌ర్సీస్ నుంచే 6 కోట్లు (1మిలియ‌న్ అమెరికా డాల‌ర్లు) వ‌సూలు చేసే స‌త్తా వ‌రుణ్ తేజ్‌కి ఉందిప్పుడు. అది బ‌య్య‌ర్లు, పంపిణాదారుల్లో అత‌డిపై న‌మ్మ‌కం పెరిగేందుకు దోహదం చేసింది. ఆ క్ర‌మంలోనే వ‌రుణ్‌తేజ్ త‌న కెరీర్‌లో భారీ ప్రాయోగానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

ఎవ‌రూ ట‌చ్ చేయ‌ల‌ని స్పేస్ బ్యాక్‌డ్రాప్‌.. ఈ కాన్సెప్టే ఓవ‌ర్సీస్‌, ఏ-క్లాస్‌లో అడ్వాన్స్‌డ్ హిట్ అని చెప్పాలి. ప్ర‌యోగాల `ఘాజీ` ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డితో క‌లిసి అంత‌రిక్షం బ్యాక్‌డ్రాప్ (స్పేస్) మూవీని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. వ‌రుణ్ డేర్‌-గ‌ట్స్‌కి ఈ ప్ర‌య‌త్నం ఓ పెద్ద‌ ఎగ్జాంపుల్‌. అంతేకాదు.. ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌లు వ‌రుణ్ స‌ర‌స‌న న‌టిస్తార‌ని తెలుస్తోంది. కానీ ఆ ఇద్ద‌రితో పాట‌లు ఉండ‌నే ఉండ‌వ‌ట‌. ఓన్టీ రొమాన్స్ చేస్తాడ‌ని చెబుతున్నారు. అంటే స్పేస్‌లో ల‌వ్‌, రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ఇద‌ని అనుకోవ‌చ్చు. ముకుంద‌, కంచె, లోఫ‌ర్‌, మిస్ట‌ర్‌, ఫిదా, తొలి ప్రేమ .. ఈ సినిమాలు ప‌రిశీలిస్తే వీటిలో ఎక్క‌డా రెండో హీరోయిన్‌తో వ‌రుణ్ పెద్దంతగా రొమాన్స్ చేసిందే లేదు. కాబ‌ట్టి రాబోవు స్పేస్ మూవీ సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పొచ్చు. పాట‌ల్లేవ్‌! పాడుకోడాల్లేవ్‌!! కానీ భామ‌ల‌తో రొమాన్స్ ఉంటుంద‌న్న‌మాట‌!