వీరభోగ వసంతరాయలు మూవీ టాక్.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కొంప‌ముంచిందా..?

Friday, October 26th, 2018, 01:54:37 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రో విభిన్న‌మైన కథాంశంతో తెర‌కెక్కిన చిత్రం త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. నారా రోహిత్, శ్రీయా, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వీరభోగ వంసతరాయలు చిత్రం ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. టీజ‌ర్ ట్రైల‌ర్ల‌తో అద‌ర‌గొట్టి అంచ‌నాలు పెంచేసింది ఈ చిత్రం. ట్రైల‌ర్‌లో చూపించిన‌ట్టు థిల్ల‌ర్ నేప‌ధ్యంలో తెర‌కెక్కిన ఈచిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు ఆక‌ట్టుకుందో ప‌బ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.

వీరభోగ వంసతరాయలు చిత్రం ప్ర‌చార ఆర్భాటం త‌ప్పీ క‌థ‌లో ఏం లేద‌ని.. ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించిద‌ని కొంద‌రు చెబుతుంటే.. బాగానే ఉంద‌ని మరి కొంద‌రు చెబుతున్నారు. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ చిత్రం.. ద‌ర్శ‌కుడు ప్రెజెంట్ చేసిన విధానంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడ‌ని.. స్క్రీన్ ప్లే అయితే అస్స‌లు ఆక‌ట్టుకోలేద‌ని.. దీంతో ఈ మిస్ట‌రీ చిత్రాన్ని చూడ‌డానికి వెళితే చాలా ప్ర‌మాద‌మ‌ని తేల్చేశారు. ఇక ఈచిత్రాన్ని వారం రోజుల ముందే అమెరికాలో ప్రీమియ‌ర్స్ వేశారు. దీంతో ఇక్క‌డ ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే ప్లాప్ టాక్ బ‌య‌ట‌కు రావ‌డంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరభోగ వంసతరాయలు చిత్రం పై బాగా నెగిటీవ్ ఎఫెక్ట్ ప‌డింది. దీంతో ఓవ‌ర్ కాన్ఫిడెన్సే వారి కొంప‌ముంచింద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments