నాగ చైతన్య గురించి ఎవరికీ తెలియని విషయాలని వెల్లడించిన వెంకటేష్!

Tuesday, December 10th, 2019, 10:12:17 PM IST

ఇటీవల కాలంలో ఎక్కువగా యంగ్ హీరోలతో నటిస్తున్న ఏకైక నటుడు ఎవరంటే వెంకటేష్ అనే చెప్పాలి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఇపుడు వెంకీ మామ చిత్రంలో నాగ చైతన్య తో నటిస్తున్నాడు. అయితే వెంకీ మామ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకీ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని ఇప్పటివరకు చాలాసార్లు తెలిపారు వెంకటేష్. అయితే నాగ చైతన్య, రానా దగ్గుబాటి కూడా సినిమాల్లోకి వస్తారని ఊహించలేదని అన్నారు.

అయితే నాగ చిటాన్యా గురించి మాట్లాడుతూ, చైతూ హీరో అవుతాడని అసలు ఊహించలేదని అన్నారు. చిన్నపుడు లావుగా ఉండి, ఎపుడూ చికెన్ తింటూ బుగ్గలతో ముద్దుగా ఉండేవాడని తెలిపారు. అయితే అలాంటి చైతూ ఇప్పుడు ఫిట్ గా, స్లిమ్ గా తయారయ్యాడని అన్నారు. అంతేకాకుండా చిన్నప్పటినుండి చూస్తూ ఉండటం వలన, రెగ్యులర్ గా మాట్లాడుకునే వాళ్ళం కనుక అంత తేలికగా నటించలేకపోయాం అని తెలిపారు. అయితే ఈ చిత్రంలో షాకింగ్ ఎలిమెంట్ తో పాటుగా, ఎవరూ ఊహించని బిగ్ సర్ప్రైజ్ ఉందని వెంకటేష్ అన్నారు.