`సుల్తాన్‌` రీమేక్‌లో వెంకీ, `గురు` బ్యూటీ నాయిక‌..!

Sunday, September 24th, 2017, 11:12:54 PM IST


విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన రీమేక్ చిత్రం `గురు` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకోక‌పోయినా వెంకీ కెరీర్‌లో మైలు రాయి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో బాక్స‌ర్‌గా న‌టించిన రితిక సింగ్‌కి మంచి పేరొచ్చింది.

అయితే ఆ సినిమా వ‌చ్చి వెళ్లినా వెంకీ ఇంకో సినిమాకి సంత‌కం చేయ‌క‌పోవ‌డం ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చ‌కొచ్చింది. ఆ క్ర‌మంలోనే వెంకీ ప్ర‌స్తుతం ఓ రీమేక్ చిత్రంపై మ‌న‌సు పారేసుకున్నాడ‌ని .. త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `సుల్తాన్‌` రీమేక్ రైట్స్‌ని డి.సురేష్‌బాబు ఛేజిక్కించుకుని తెలుగైజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారుట‌. క‌థానాయ‌కుడిగా వెంకీ, క‌థానాయిక‌గా రితిక సింగ్‌ల‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. చూద్దాం.. అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments