వావ్ .. పోస్టర్ తో అదరగొట్టిన .. యమన్ ఆంటోని !!

Friday, February 17th, 2017, 06:41:13 PM IST


”బిచ్చగాడు” సినిమాతో టాలీవుడ్ లో మంచి మార్కెట్ కొట్టేసాడు తమిల్ హీరో విజయ్ ఆంటోని. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా సంచలన విజయం సాధించి .. ఏకంగా భారీ లాభాలను రాబట్టింది. ఇక ఆ సినిమా తరువాత అయన తమిళ సినిమాలకు ఇక్కడ మంచి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం విజయ ఆంటోని నటిస్తున్న యమన్ సినిమా ఈ నెల 24 న విడుదల అవుతున్న సందర్బంగా పబ్లిసిటీ ని బిన్నంగా ప్లాన్ చేశారు, ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరోలందరి ఫొటోలతో కలిపి ఓ పోస్టర్ ని విడుదల చేశారు ? నిజంగా ఈ పోస్టర్ షాక్ ఇస్తుంది. ఆ స్టార్ హీరోలు బిన్నంగా నటించిన పాత్రలకు సంబందించిన ఫొటోలతో ఈ పోస్టర్ రూపొందించి ఈ సినిమా పై ఇంకాస్త క్రేజ్ పెంచుకున్నాడు. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది .. అదేమిటో తెలుసా ఈ పోస్టర్ లో ఉన్న హీరోలు చేసిన పాత్రలన్నీ నెగిటివ్ వి కావడం విశేషం. అంటే ఈ సినిమాలో కూడా తాను నెగిటివ్ పాత్ర చేస్తున్నానని చెప్పకనే చెప్పాడు ? మరి ఆ పోస్టర్ పై ఓ లుక్ వేయండి !!