అక్కినేని పాత్రలో అర్జున్ రెడ్డి హీరో

Wednesday, November 8th, 2017, 05:28:25 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కుతోంది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా ఎలా ఉండబోతోందో గాని సినిమా కోసం ఎంచుకుంటున్న పాత్రలను చూస్తుంటే భారీ అంచనాలను రేపుతోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఎస్వీ రంగారావు గారి పాత్రలో మోహన్ బాబు ని రీసెంట్ గా ఫిక్స్ చేశారు. జెమిని గణేషన్ గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు.

అయితే రీసెంట్ గా మరొక నటుడి పేరు బాగా వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కొత్త పాఠాలు నేర్పిన విజయ్ సాయి దేవరకొండ మహానటి లో అక్కినేని నాగేశ్వర రావు గారి పాత్రలో కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. విజయ్ అలాగే చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నాగ్ అశ్విన్ తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహానటిలో కూడా దర్శకుడు అర్జున్ రెడ్డి హీరోకి మంచి రోల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments