వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ షాకింగ్ లుక్.!

Sunday, June 21st, 2020, 10:24:20 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ట్రెండ్ సెట్టింగ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా ఆగాల్సి వచ్చింది.

అయితే విజయ్ దేవర కొండ తన ప్రతీ సినిమాకు సంబంధం లేకుండా ఏదొక షాకింగ్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపర్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేవాడు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా అతనిపై ట్రోల్స్ పడేవి.

అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా తన సినిమాల్లో హీరోలను కూడా ఎంత యూనిక్ గా చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు చేస్తున్న సినిమాలోదో ఏమో కానీ విజయ్ దేవరకొండ లేటెస్ట్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.

పొడవాటి జుట్టు తో పిల్లి గడ్డంతో దర్శనం ఇచ్చిన విజయ్ ను మొదటి సారి చూస్తే మాత్రం ఎవరూ ఖచ్చితంగా పోల్చుకోలేరు. అలా ఉన్నాడు విజయ్. మరి ఇది సినిమాలో లుక్కా లేక మరేదన్నా అన్నది తెలియాల్సి ఉంది.మొత్తానికి మాత్రం ఈ కొత్త లుక్ దెబ్బకు విజయ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.