కన్నడ క్రేజీ ప్రొడ్యూసర్ తో విజయ్ దేవరకొండ సినిమా ?

Saturday, October 13th, 2018, 01:28:57 PM IST

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కు రోజు రోజుకు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోతూనే ఉంది . తాజాగా నోటా సినిమాతో అటు కోలీవుడ్ లోకూడా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరాకు ఈ సినిమా మొదలు కానుంది. దాంతో పాటు ప్రముఖ కన్నడ నిర్మాతతో సినిమాకు ఓకే చెప్పాడట. ఆ నిర్మాత ఎవరో కాదు రజని కాంత్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు తీసిన రాక్లైన్ వెంకటేష్. ఇది వరకే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని .. వెంకటేష్ బ్యానర్ లో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట విజయ్. సో ప్రస్తుతం మంచి కథకోసం అన్వేషణ జరుగుతుంది. కథ కుదిరిందా విజయ్ అటు కన్నడలోకి ఎంట్రీ కుదిరినట్టే. మొత్తానికి మనోడు సౌత్ పై బాగానే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.