విజయ్ దేవరకొండకు, అల్లు అర్జున్‌కు ఇన్‌స్టాలో గట్టి పోటీ..!

Thursday, May 20th, 2021, 01:00:11 AM IST

టాలీవుడ్ రౌడీబాయ్‌గా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా మరో నయా రికార్డ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 12 మిలియన్లకు చేరుకుంది. అయితే ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ విజయ్ దేవరకొండ కావడం విశేషం. అయితే ఇన్‌స్టాలో అల్లు అర్జున్ విజయ్ దేవరకొండకు మధ్య గట్టి పోటీ నడుస్తుంది. విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్లుగా ఉంటే, అల్లు అర్జున్ 11.9 ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

అయితే ఈ విషయంలో మహేశ్, ప్రభాస్, ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌ వంటి స్టార్ హీరోలు కాస్త వెనుకబడే ఉన్నారు. మహేశ్ బాబుకు 6.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా, ప్రభాస్‌కు 6.5 మిలియన్లు, రామ్ చరణ్‌కు 3.9 మిలియన్లు, ఎన్‌టీఆర్‌కు 2.6 మిలియన్లు కలిగి ఉన్నారు. ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనుండగా ఆయన సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది.