ఊహించ‌ని స్ట్రోక్‌తో విల‌విల‌లాడుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. త‌ప్ప‌కుండా షేర్ చేయాల్సిన మ్యాట‌ర్..!

Wednesday, October 10th, 2018, 06:18:37 PM IST

తెలుగు వెండితెర పైకి అనూహ్యంగా దూసుకువ‌చ్చాడు యంగ్ హీరో విజ‌య దేవ‌ర‌కొండ‌. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం వ‌రుస‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించి హ్యాట్రిక్ హిట్స్ న‌మోదు చేసుకున్నాడు. దీంతో విజ‌య దేవ‌ర‌కొండకి పొగ‌రు అమాంతం పెరిగిపోయింది. దీంతో స్టేజ్‌ల‌పై చాలా రెక్లెస్‌గామాట్లాడమే కాకుండా, అదేదో పెద్ద‌స్టైల్ అని భ్ర‌మ‌ప‌డుతూ, తానే ఇప్పుడు యూత్ మొత్తానికి పెద్ద ఐకాన్ అని తెగ బిల్డ‌ప్ కొట్టుకున్నాడు.

అయితే వరుస విజ‌యాలో క‌న్నూమిన్ను ఆడ‌కుండా విర్ర‌వీగిన ఈ రౌడీ స్టార్ ఖాతాలో ఊహించ‌ని అట్ట‌ర్ ప్లాప్ వ‌చ్చి ప‌డింది. తాజాగా విజ‌య్ న‌టించిన నోటా చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో చాలామంది పండుగ చేసుకుంటూ ప‌నిగ‌ట్టుకుని మ‌రీ విజ‌య్ పై కామెంట్స్ చేస్తున్నారు. దీంతో భాగా హ‌ర్ట్ అయిన ఈ యంగ్ హీరో త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించాడు. నేను న‌టించిన నోటా చిత్రం ప్లాప్ అయినందుకు చాలామందికి సంతోషంగా ఉంద‌ని త‌న‌కు ఒక్క ప్లాప్ వ‌చ్చినంత మాత్రాన త‌ను ఉధ్య‌మం ఆప‌న‌ని నేను ఎప్ప‌టికీ రౌడీనేన‌ని పోస్టు చేశారు.

అయితే గ‌తంలో ఇలాగే చిన్న‌వ‌య‌సులో స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న త‌రుణ్‌, ఉద‌య్ కిర‌ణ్‌లు ప్ర‌స్తుతం ఏమ‌య్యారో అంద‌రికీ తెలిసిందే. అయినా హీరోయిజం అంటే హిట్లు వ‌చ్చిన‌ప్పుడు కాదు.. వ‌రుస‌గా ప్లాపులు వ‌చ్చినా, ఆ త‌ర్వాత త‌ను న‌టించిన సినిమాకి ప్రేక్ష‌కులు వ‌చ్చి క్యూలో నిల‌బ‌డాలి.. అది హీరోయిజం అంటే.. అయితే విజ‌య్‌కు ఇంకా అలాంటి ప‌రిస్థితులు ఎదురు కాలేద‌నుకోండి. ఏది ఏమైనా మీడియా కూడా త‌న టీఆర్పీల‌ను పెంచుకోవ‌డానికి విజ‌య్‌ను బాగానే ఓవ‌ర్ హైప్ చేసింది. దీంతో మితిమీరి ఓవ‌ర్ యాక్ష‌న్ చేసిన విజ‌య్‌కి నోటా ద్వారా స‌రైన దెబ్బ‌ప‌డింది. దీంతో విజ‌యాలు రాగానే త‌న‌కంటే పెద్ద స్టార్లు లేర‌ని భావించే వారికి ఇలాంటి బ్రేక్‌లు ప‌డితే గానీ క్ర‌మ‌శిక్ష‌ణ‌లో ఉండ‌ర‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.