విజయ్ కోసం ఇద్దరు హీరోయిన్స్ రెడీ ?

Thursday, October 11th, 2018, 11:01:30 PM IST

సంచలన స్టార్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ కు తాజాగా విడుదలైన నోటా కాస్త బ్రేక్ వేసింది. భారీ అంచనాలమధ్య విడుదలైన ఈ సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇక ఈ ప్రాజెక్ట్ తరువాత విజయ్ మరో సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఓనమాలు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేసారు.

అందులో గ్లామర్ భామ రాశి ఖన్నా తో పాటు తమిళ భామ ఐశ్వర్య రాజేష్. మొదటి సారి విజయ్ దేవరకొండ ఇద్దరు హీరోయిన్స్ తో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మరి ఇద్దరు భామల సరసన విజయ్ ఎలాంటి రొమాన్స్ పండిస్తాడో చూడాలి. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చివరి దశలో ఉండగా .. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన టాక్సీవాలా విడుదలకు సిద్ధంగా ఉంది.