నోటా సెటైర్స్ పై ఘాటుగా కౌంటర్ వేసిన విజయ్ ?

Thursday, October 11th, 2018, 12:26:21 AM IST

సంచలన నటుడు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా చిత్రం భిన్నమైన రెస్పాండ్ తో ముందుకు సాగుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఎక్కువగా నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముక్యంగా విజయ్ అంటే వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఓ ఆటా ఆడుకుంటున్నారు. ఈ విషయం పై స్పందించిన విజయ్ ఘాటుగానే స్పందించాడు. నాకోసం థియేటర్స్ కి వెళ్లి నోటా సినిమా చూస్తున్న వారికీ నా ప్రేమను తెలుపుతున్నా ఇతరులు పరాజయం పొందాలని ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడే వేడుక చేసుకోండి ..

నేను సాకులు చెప్పను .. బాధ్యత తీసుకుంటా నోటా విషయంలో నేను గర్వాంగా ఉన్నాను. ఇది మీకు చెప్పాలి తమిళనాడు లో ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు అంటూ ట్విట్ చేసాడు. నాపై వచ్చిన విమర్శలను సీరియస్ గా తీసుకోను, శోధించి నా పరంగా చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా అయినా నా స్వభావం మారదు అంటూ ఘాటుగానే స్పందించాడు. రౌడీగా ఉండడం అంటే విజయం పొందడం కాదు .. విజయం కోసం పోరాడడం కాబట్టి పోరాడుతూనే ఉంటాం అంటూ స్పందించాడు.