మోడీ వల్ల…ఆ హీరో చాల ఇబ్బందులు పడ్డాడట !!

Saturday, November 19th, 2016, 11:00:12 PM IST

money
ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దుతో … దేశమంతటా నానా కష్టాలు పడుతున్నారు జనాలు. చిల్లర డబ్బులకోసం ప్రజల పాట్లు మాములుగా లేవు? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళను కట్టడి చేయడం ఏమోగానీ … సాధారణ జనాలకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. ఇక తమిళంలో స్టార్ హీరోగా మారిన ఆ హీరోకూడా చిల్లరకోసం ఇబ్బందులు పడ్డాడట!! ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా … అయన ఎవరో కాదు తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి. మోడీ నిర్ణయం వల్ల తన కూతురికి కనీసం ఇడ్లి కూడా కొనిపెట్టలేక పోయానని తెగ ఫీలయ్యాడట? మోడీ పెద్ద నోట్ల రద్దురోజు తన కూతురు శ్రీజ తీవ్ర జ్వరంతో ఉందని, ఆసుపత్రిలో చూపించి ఇంటికి తీసుకువెళితున్న సమయంలో తాను ఇడ్లి తింటానని అడిగితె .. కొనిపెట్టలేకపోయానని, తన వద్ద 500, 1000 నోట్లు ఉండడంతో ఎవరు తీసుకుని చిల్లర ఇవ్వలేదని ఆయన తెలిపాడు !! తన కూతురికి ఇడ్లి కొనిపించాలేక పోయానని తెగ ఫీలయ్యాడట !! మోడీ నిర్ణయం వల్ల చాలా మంది జనాలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు.