విమర్శకులకు విజయశాంతి కౌంటర్ !

Monday, June 3rd, 2019, 01:12:34 PM IST

ఒకప్పటి సీనియర్ నటి, ప్రస్తుతం కాంగ్రెస్ తరపున క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న విజయశాంతి త్వరలో సినీ రంగంలోకి రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు చేయనున్న కొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆమె ఒక కీ రోల్ చేయనున్నారు. ఇలా ఆమె సినిమాల్లోకి రానుండటంతో ఇకపై రాజకీయాలకు దూరమవుతారనే కామెంట్స్ బలంగా వినబడ్డాయి.

వీటిని తీవ్రంగా పరిగణించిన రాములమ్మ గట్టిగానే సమాధానమిచ్చారు. సినిమాల్లొకి రీఎంట్రీ ఇచ్చినా రాజకీయాలను వదిలేది లేదని స్పష్టం చేశారు. అలాగే 2014 నుండి 2018 వరకు పార్టీకి దూరంగా ఉన్నా ఆమెకు పిలిచి భాద్యతలిచ్చారనే విమర్శలకు కూడా ఆమె ఆన్సర్ ఇచ్చారు. నేను 2014 నుండి పార్టీ పనుల్లో లేరని అంటున్నారు. కానీ ఉన్నాను. బయటికి కనబడపోవచ్చు. కానీ పార్టీ అప్పగించిన ప్రతి పనిని చిత్తశుద్ధితో నిర్వహించాను. అందుకే క్యాంపైన్ కమిటీ భాద్యతల్ని నాకు అప్పగించారు అని అన్నారు.

ఇక రాజకీయాల పట్ల తన కమిట్మెంట్ ఎలాంటిదో చెబుతూ ఆరు నెలల క్రితమే నాకు సినిమా ఆఫర్ వచ్చింది. కానీ పార్టీ పనులు ఉండటంతో పక్కనబెట్టాను. ఇప్పుడు అన్ని పనుల్ని పూర్తిచేశాను కాబట్టే సినిమాకి సైన్ చేశానని అన్నారు.