మనం దర్శకుడి నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ ?

Tuesday, January 9th, 2018, 10:39:52 PM IST

లేటెస్ట్ గా హలో సినిమాతో మరో విజయాన్ని అందుకున్న విక్రమ్ కుమార్ నెక్స్ట్ సినిమా ఏదనే విషయం పై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విక్రమ్ కుమార్ తో సినిమా చేయడానికి పలువురు స్టార్ హీరోలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరో వైపు విక్రమ్ కుమార్ కూడా నెక్స్ట్ సినిమా విషయంలో మాత్రం పక్కా క్లారిటీతో ఉన్నాడు. ఇంతకీ అయన నెక్స్ట్ ప్లాన్ ఏమిటో తెలుసా .. విక్రమ్ కుమార్ నెక్స్ట్ సినిమా మళ్ళీ నితిన్ తో చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. ఎందుకంటే నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమాతో విక్రమ్ కు మంచి క్రేజ్ దక్కింది. ఆ సినిమా తరువాత మళ్ళీ నితిన్ తనతో మరో సినిమా చేయమని అడిగాడట.. అప్పుడే ఈ సినిమా చేస్తానని విక్రమ్ చెప్పాడని, తనకు దర్శకుడిగా క్రేజ్ తెచ్చిన నితిన్ కు మరో సినిమా చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడు విక్రమ్. నిజానికి సూర్య 24 సినిమా తరువాత చేయాలనీ ప్లాన్ చేసాడట కానీ ఈ లోగా హలో సినిమా వచ్చింది. అందుకే ఇప్పుడు నితిన్ కోసం ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట.