వైజాగ్ లో వినయ విధేయ రాముడు..!

Saturday, November 10th, 2018, 04:30:50 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటిల కంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే, దీపావళి నాటి నుండి ఈ చిత్రానికి సంబందించిన విశేషాలు ఫస్ట్ లుక్, టీజర్, ఇలా ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ చిత్రనికి సంబంధించి షూటింగ్ దాదాపు అయిపోయిందని, కొన్ని పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం లో చరణ్ పక్క మాస్ హీరోగా కనిపించబోతున్నారట. పక్కాగా భారీ హిట్ కొట్టేందుకు కావాల్సిన అన్ని హంగులు సెట్ చేసుకున్నారట.

పాటల చిత్రీకరణ పూర్తైన తర్వాత డిసెంబర్ నెలాఖరులో ఏ ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం వైజాగ్ లో బారి ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం, రామ్ చరణ్ గత చిత్రం రంగస్థలం కూడా వైజాగ్ ప్రీ- రిలీజ్ ఫంక్షన్ జరుపుకొని బారి హిట్ గా నిలిచింది. ఇపుడు అదే సెంటిమెంట్ తో వినయ విధేయ రామ ఆడియో రిలీజ్ కూడా సాగర తీరాన జరిపేందుకు రామ్ చరణ్ ఆసక్తి కనబరుస్తున్నారట. మరో వైపు ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అనూహ్య స్పందన రావటం తో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. ఒక్కరోజులోనే 10మిలియన్ల వ్యూస్ సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకోవటంతో మెగాఫ్యాన్స్ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఇదే ఊపులో సినిమా కూడా భారీ ల=కలెక్షన్లు కొల్లకొట్టాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీజర్ లో చరణ్ చెప్పిన “నేను రామ్ కొ.. ని.. దె..ల” అన్న డైలాగ్ ఇప్పటికే మెగా మంత్రంలా మారింది.