“వినయ విధేయ రామ” చరణ్ మళ్ళీ బద్దలు కొట్టేలా ఉన్నాడు.!

Friday, November 9th, 2018, 02:20:41 PM IST

బోయపాటి శ్రీను మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్లో రాబోతున్న పక్కా మాస్ మసాలా చిత్రం “వినయ విధేయ రామ” ఇప్పటికే విడుదల చేసినటువంటి ఫస్ట్ లుక్ తోనే అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఆ ఆనందాన్ని మరింత ఎక్కువ చేసేందుకు ఈ రోజు ఉదయం టీజర్ ను కూడా విడుదల చేశారు.ఈ విడుదల చేసినటువంటి టీజర్ ను చూస్తే మాత్రం చరణ్ అభిమానులకు పండగే అని చెప్పాలి.

వారు ఏదైతే వీరి ఇద్దరి కాంబినేషన్ నుంచి ఆశించారో అదే స్థాయిలో ఉందని అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.చరణ్ కి ఇప్పటికే మాస్ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది..అలాగే బోయపాటికి కూడా మాస్ ఆడియెన్స్ యొక్క పల్స్ నరనరాల్లో తెలుసు ఇక ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ఈ ఒక్క టీజర్ లో చూపించేసారు.రంగస్థలం చిత్రంతోనే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన రామ్ చరణ్ ఇప్పుడు ఈ చిత్రంతో కూడా అంతకు మించి రికార్డులు కొట్టడానికి వస్తున్నాడని అభిమానాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments