వినయ విధేయ రామ ఫ‌స్ట్ లుక్ అవుట్.. నిరాశ‌లో మెగా అభిమానులు..!

Tuesday, November 6th, 2018, 02:57:48 PM IST

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ తాజా చిత్రం విన‌య విధేయ రామ‌. డి.వి.వి దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాణి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక‌ రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ నుండి వ‌స్తున్న చిత్రం కావ‌డం, మ‌రోవైపు మాస్ యాక్షన్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన బోయ‌పాటి ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ కావ‌డంతో.. ఈ చిత్రం పై మెగా అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీంతో వినయ విధేయ రామ ఫ‌స్ట్ లుక్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆశ‌క్తిగా ఎదురు చూశారు.

అయితే ఈ నేప‌ధ్యంలో తాజాగా దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల అయిన విన‌య విధేయ రామ‌ ఫ‌స్ట్ లుక్ మెగా అభిమానుల‌ను నిరాశ‌ప‌రుస్తోంది. ప‌క్కా మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పై మెగా అభిమానులు భారీగా ఊహించుకోగా రామ్ చ‌ర‌ణ్ యాక్ష‌న్ గ్రాఫిక‌ల్ పోస్ట‌ర్‌ను ఒక‌టి డిజైన్ చేసి వ‌దిలారు. ఆ పోస్ట‌ర్‌లో త‌న ఎడ‌మ‌ చేతిలో క‌త్తి ప‌ట్టుకొని.. చిరుత‌లా ప‌రుగెత్తుకుంటూ మ‌రో క‌త్తిని అందుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న స్టిల్ చాలా రొటీన్‌గా అనిపిస్తోంది. ఇక చెర్రికి వేసిన కాస్టూమ్స్ కూడా పెద్ద‌గా సెట్ కాలేదు.. కొంచెం ఎబ్బెట్టుగా ఉన్న‌ట్టు అనిపిస్తున్నాయి. దీంతో ఎంతో ఆత్రుత‌గా చూసిన మెగా అభిమానులు బోయ‌పాటి నిరాశ‌ప‌ర్చాడ‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమా టీజ‌ర్‌ను నవంబర్ 9 విడుద‌ల చేయ‌నున్నార‌ని.. అలాగే సినిమాని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ని చిత్ర నిర్మాత తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments