టీజర్ టాక్ : మెగా గ్లాడియేటర్ (వినయ విధేయ రామ)

Friday, November 9th, 2018, 11:45:26 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కంబినేషన్ లో వస్తున్న చిత్రం వినయ విధేయ రామ, ఈ చిత్రం మొదలైన రోజు నుండి సినిమా గురించిన విశేషాలు కానీ, కనీసం టైటిల్ కూడా ప్రకటించకుండా అభిమానుల సహనాన్ని పరీక్షించారు. ఎట్టకేలకు దీపావళి కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకొని సినిమా పై అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు.

టీజర్ విషయానికొస్తే, ఇందులో రాంచరణ్ మ్యాచో లుక్ తో ఆకట్టుకున్నాడు. టీజర్ ని చూస్తుంటే సినిమా యాక్షన్ సీక్వెన్స్ కి పెద్ద పీట వేసారనిపిస్తుంది. మాస్ సినిమాలకు, యాక్షన్ సీన్స్ కు పెట్టింది పేరైన బోయపాటి గత కొద్దీ కాలంగా కొంచెం క్లాస్ మూవీస్ ట్రై చేస్తున్నాడు, అయితే అవేవి తన స్థాయికి తగ్గట్టు ఆడలేదు. దీంతో రామ్ చరణ్ లాంటి హీరోతో క్లాస్ సినిమా తీస్తే వర్కౌట్ అవదు అనుకున్నాడో ఏమో, మళ్లీ తనదైన మాస్ స్టైల్ ని నమ్ముకున్నాడు. టీజర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ తో, తనదైన డైనమిక్ బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టాడు. విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ లుక్ కూడా ప్రామిసింగ్ గా నే ఉంది, సహజంగానే బోయపాటి సినిమాల్లో విలన్ పాత్రకి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇందులో తమిళ హీరో ప్రశాంత్ రాంచరణ్ కి అన్నయ పాత్రలో నటించాడట, ఈ సినిమా కథ అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుందంటూ టాక్ వినిపిస్తుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. దానయ్య డీవీవీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న ఈ చిత్రం టీజర్ తో ఏర్పడ్డ అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments