చైతూ… నాని.. ఇద్ద‌రిలో ఎవ‌రు?

Sunday, September 25th, 2016, 04:38:57 PM IST

nagachaitanya-nani
టూ స్టేట్స్ రీమేక్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన ఆ చిత్రం రీమేక్ రైట్స్ కోసం పెద్ద పోటీనే న‌డిచింది. వి.వి.వినాయ‌క్ రంగంలోకి దిగి త‌న శిష్యుడు వెంక‌ట్ కుంచెమ్‌కి ఆ రైట్స్ ఇప్పించాడు. స‌క్సెస్‌ఫుల్ సినిమా కావడంతో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ ప్రొడ్యూస్ చేయ‌డానికి ముందుకొచ్చింది. అయితే క‌థానాయ‌కుల ఎంపిక ద‌గ్గ‌రే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఆ సినిమా క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా అంటే నాని, లేదంటే నాగ‌చైత‌న్య‌లాంటి క‌థానాయ‌కులైతేనే బాగుంటుంద‌ట‌. అయితే వాళ్లిద్ద‌రి చేతుల్లోనూ బోలెడ‌న్ని సినిమాలున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో వాళ్లు ఒప్పుకోవ‌డం కూడా
క‌ష్ట‌మే. మ‌రి నిర్మాత‌లు ఎవ‌రితో ఆ సినిమా చేస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే కాస్త ఆల‌స్య‌మైనా వారిద్ద‌రిలో ఒక‌రిని సెట్ చేసుకొనే సినిమాకి కొబ్బ‌రికాయ కొడ‌దామ‌నుకొంటున్నార‌ట‌. హిందీలో అర్జున్ క‌పూర్ న‌టించాడు. త‌న న‌ట‌న‌తో సినిమాకి హైలెట్‌గా నిలిచాడు. ఆ స్థాయి క్యాలిబ‌ర్ ఉన్న న‌టులైతేనే బాగుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తూ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.