“ఎన్టీఆర్ బయోపిక్ ” లో వినాయక్ …?

Friday, November 2nd, 2018, 11:49:07 AM IST

నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడిల కంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్”, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించి విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం ప్రముఖ నటులను ఎంపిక చేసారు. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్, జయప్రద పాత్రకు తమన్నా, హరికృష్ణ పాత్రకు కళ్యాణ్ రామ్, చంద్రబాబు పాత్రలో రానా, ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్నారు.

ఎన్టీఆర్ సినీ కెరీర్లో మరో కీలక పాత్ర దర్శకుడు దాసరి నారాయణ రావు ది అని చెప్పాలి. ఆ రోజుల్లో వీళ్లిద్దరి కంబినేషన్ లో చాలా హిట్ చిత్రాలు వచ్చాయి, కాగా ఇప్పుడు ఈ పాత్రకు ప్రముఖ దర్శకుడు వీ. వీ. వినాయక్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అలాంటి కీలక పాత్రకు వినాయక్ ను ఎంపిక చేయటంతో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక సినిమాలో దాసరి గురించి ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో వేచి చూడాలి.