వైరల్ న్యూస్: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథకి ఓకే చెప్పిన పవన్… కారణం అదేనా?

Sunday, May 17th, 2020, 06:16:47 PM IST


తెలుగు సినీ పరిశ్రమ లో పవన్ కళ్యాణ్ పేరు వింటేనే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. అయితే రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ రెండేళ్ల సినీ విరామ తర్వాత వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా అయిన, తర్వాత చేసే విరూపాక్ష అయిన అంతే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హరీష శంకర్ తో సినిమా.

పవన్ కళ్యాణ్ ఫ్లాప్ లతో సతమతమవుతుంటే గబ్బర్ సింగ్ చిత్రం పవన్ కు, మరియు అభిమానులకు భారీ ఊరట ఇచ్చింది. కేవలం పవన్ మ్యానరిజాం, హరీష శంకర్ పవర్ ఫుల్ డైలాగ్స్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే పవన్ తో చేయబోయే సినిమా కు సంబంధించిన కథ పై ఇపుడు సోషల్ మీడియా లో, ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఎన్టీఆర్ కి వినిపించిన కథ నీ పవన్ కు కూడా యధావిధగా చెప్పారట హరీష్. అయితే ఎన్టీఆర్ దీనిని రిజెక్ట్ చేయగా, పవన్ కళ్యాణ్ మాత్రం ఓకే చేశారట. గతంలో ఒక హీరో రిజెక్ట్ చేసిన చిత్రాలు మరొక హీరో చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యాయి, భారీ ఫ్లాప్ లు కూడా అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం స్క్రిప్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి దీని పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.