క్రికెటర్ బుమ్రా అనుపమ ప్రేమలో పడిపోయాడా..!

Tuesday, June 11th, 2019, 05:10:54 PM IST

ఇండియన్ క్రికెటర్, బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మధ్య ప్రేమాయణం మొదలైందంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఇక్కడితో ఆగకుండ నెమ్మదిగా జాతీయ మీడియా స్థాయి వరకు వెళ్ళిపోయాయి. అయితే వీరిపై ఈ అనుమానాలు రావడానికి పలు కారణాలే ఉన్నాయట. అయితే వీరి మధ్య పరిచయమే లేదు కానీ సోషల్ మీడియాలో వీరు ఒకరినొకరు ఫాలో అవుతున్నారట. అయితే హీరోయిన్లలో బుమ్రా ఫాలో అవుతున్నది అనుపమను ఒక్కటే. వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరు పెట్టే పోస్ట్‌కు మరొకరు వెంటనే లైకులు కొట్టుకోవడం, ఒకరి పోస్ట్‌లను ఒకరు షేర్ చేయడం చేస్తున్నారు.

ఇక ఇంకేముంది గత కొద్ది రోజులుగా దీనిని గమనించిన నెటిజన్‌లు ఇక తమ ప్రచారానికి తెరలు లేపారు. బుమ్రా, అనుపమ మధ్య ప్రేమ ఉందంటూ ప్రచారం మొదలు పెట్టేసారు. అయితే ఇది కాస్త ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది అందరిలో. వీరిద్దరు ఎప్పుడు కలిసి తిరగలేదు, పార్టీలలో కనిపించలేదు, పబ్‌లకు వెళ్లలేదు వీరి ఇద్దరి మధ్య ఇది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారట. అయితే దీనిపై ఓ జాతీయ మీడియాతో అనుపమ మాట్లాడుతూ బుమ్రా నేను మంచి స్నేహితులం తప్పా మా మధ్య వస్తున్న కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని, మాపై వస్తున్నవన్ని పుకార్లే తప్పా నిజం కాదని కొట్టి పారేసింది. అయితే ఈ విషయంపై అనుపమ క్లారిటీ ఇచ్చినా కూడా ఇంకా కొందరిలో అనుమానాలు మాత్రం తగ్గడంలేదట.