మెగాస్టార్ – కొరటాల ప్రాజెక్ట్ పై వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్!

Tuesday, July 23rd, 2019, 06:18:05 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ 151వ సినిమా “సైరా నరసింహా రెడ్డి” చిత్రం ఇప్పుడు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ నాటికి ఎలా అయినా సరే విడుదల చెయ్యాలని దర్శకుడు సురేందర్ రెడ్డి టీమ్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం తర్వాత మెగాస్టార్ మరియు వరుస హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా ఉన్న సంగతి కూడా అందరికి తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం అతి త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది అంతేకాకుండా ఈ సినిమా మొట్ట మొదటి షెడ్యూల్ పలాసలో మొదలు కానుంది అని ఈ షూటింగ్ నవంబర్ నెల నుంచి మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది.మరి మెగాస్టార్ నటించబోతున్న 152వ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.