స్క్రిప్టింగ్‌: పందెంకోడి 3, అభిమ‌న్యుడు 2!

Tuesday, October 23rd, 2018, 10:38:56 PM IST

విశాల్ న‌టించిన సందెకోజి 2 త‌మిళంలో చ‌క్క‌ని విజ‌యం సాధించింద‌ని ఠాగూర్ మ‌ధు తెలిపారు. పందెంకోడి 2 పేరుతో తెలుగులోనూ రిలీజై ఈ ద‌స‌రా బ‌రిలో సంతృప్తిక‌ర ఫ‌లితం ఇచ్చింద‌ని అన్నారు. కేవ‌లం 6కోట్ల‌కు రైట్స్ తీసుకుంటే, ఆ మేర‌కు వ‌సూళ్లు ద‌క్క‌డం ఆనందాన్నిచ్చింద‌ని వెల్ల‌డించారు. పందెంకోడి 3 స్టోరీ లైన్ విన్నాను. ఎంతో ఎగ్జ‌యిట్ చేసింది. 2020లోపే ఈ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేస్తామ‌ని తెలిపారు.

అలానే విశాల్ ప్ర‌స్తుతం వ‌రుస క‌మిట్‌మెంట్ల‌తో బిజీ. మా బ్యాన‌ర్‌లోనే `టెంప‌ర్` త‌మిళ రీమేక్‌లో న‌టిస్తున్నాడు. అటుపై అభిమ‌న్యుడు 2, పందెంకోడి 3 లైన్‌లోకి వ‌స్తున్నాయి. వీటితో పాటే సుంద‌ర్‌.సితో ఓ సినిమా, బివిఎస్‌.ఎన్‌తో ఓ సినిమాకి క‌మిట‌య్యాడు విశాల్. ఇవ‌న్నీ స్క్రిప్టు ద‌శ‌ల్లోనే ఉన్నాయి. బివిఎస్ఎన్ సినిమాకి మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. మిస్కిన్ తో విశాల్ క‌థా చ‌ర్చ‌లు సాగిస్తున్నార‌ని తెలిపారు. పందెంకోడి 2 ఘ‌న‌విజ‌యానికి కార‌ణం ఈ సినిమా స్క్రీన్‌ప్లే, జాత‌ర బ్యాక్‌డ్రాప్ అని అన్న‌రు. విశాల్ హీరోగా, నిర్మాత‌గా రాణిస్తున్న తీరు పొగిడి తీరాల‌ని అన్నారు. అక్టోబ‌ర్ 18న రెండు భాష‌ల్లో సినిమా రిలీజ్ ఉంది అన‌గా, అక్టోబ‌ర్ 16 రాత్రంతా షూటింగులో పాల్గొన్నాడు విశాల్‌. వేరొక హీరో ఎవ‌రూ అలా చేయ‌లేరు.. అని అన్నారు. సొంత బ్యాన‌ర్‌లో తెలుగు స్ట్రెయిట్ సినిమాల‌కు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని ప్ర‌శాస‌న్ న‌గ‌ర్లోని ఆయ‌న కార్యాల‌యంలో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో ఠాగూర్ మ‌ధు వెల్ల‌డించారు.