విశాల్ లవర్ ఆ హీరోతో … చిందులు !!

Saturday, November 19th, 2016, 11:27:55 PM IST

varalakshmi
తమిళ హీరోయిన్ వరలక్ష్మి అంటే తెలుసా? ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు … కానీ హారో విశాల్ లవర్ అంటే మాత్రం అందరు గుర్తు పడతారు? స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విశాల్ లవర్ గానే పాపులర్ అయింది. ఈ మధ్య విశాల్, వరలక్ష్మి ల మధ్య ఎందుకు చెడిందో తెలియాదు కానీ ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. లేటెస్ట్ గా వరలక్ష్మి … శింబు ఇచ్చిన విందులో పాల్గొని అతనితో కలిసి చిందులు వేయడం అందరికి షాక్ ఇచ్చింది. పైగా ఈ కార్యక్రమంలో మరో హాట్ భామ త్రిష కూడా పాల్గొంది. విశాల్ బ్రేక్ అప్ తరువాత వరలక్ష్మి శింబుతో అంత క్లోజ్ గా ఉండడం .. ఆసక్తిని రేకెత్తిస్తుంది. నడిగర్ సంగం విషయంలో కూడా శింబు, విశాల్ కు అపోజిట్ గానే ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మి కూడా శింబుతో ఉండడం చర్చలకు దారి తీస్తోంది !!