విశాల్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడా?

Wednesday, October 24th, 2018, 03:05:04 PM IST

అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజా ఈ దసరాకు పందెం కోడి 2 తో మంచి విజయాన్ని అందుకున్న అయన మరో వైపు తెలుగు టెంపర్ రీమేక్ ను తమిళంలో చేస్తున్నాడు. దాంతో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా మారిన విశాల్ త్వరలోనే పందెం కోడి 3 కూడా సెట్స్ పైకి త్వరలోనే తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎన్నో రోజులనుండి విశాల్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలనీ చాలా రోజులుగా అనుకుంటున్నాడు కానీ అది వర్కవుట్ అవ్వడం లేదు. తాజాగా విశాల్ తెలుగు సినిమాకు రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. విశాల్ నెక్స్ట్ సినిమా ను తెలుగు నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. తమిళ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల కానుంది.