విశాల్ అను నేను.. ల‌వ్ మ్యారేజే చేసుకుంటా.. అమ్మాయి కూడా రెడీ..!

Monday, October 29th, 2018, 05:58:04 PM IST

టాలీవుడ్‌లో ప్ర‌భాస్ పెళ్లి మ్యాట‌ర్ పై ర‌క‌ర‌కాల వార్త‌లు ట్రాల్ అవుతూనే ఉంటాయి. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ‌ని ప్ర‌భాస్‌ను ప‌లు వేధిక‌ల పై ప‌లువురు ప్ర‌శ్నించినా.. ఒక స్మైల్ ఇచ్చి త్వ‌ర‌లోనే చేసుకుంటాలే డార్లింగ్ అంటూ స‌మాధానం చెప్పి త‌ప్పించుకుంటాడు. అయితే కోలీవుడ్‌లో ప్ర‌బాస్ లాగే విశాల్ పెళ్లి పై కూడా ర‌క ర‌కాలుగా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. విశాల్‌ను కూడా ప‌లు వేధిక‌ల్లో ప‌లువురు పెళ్లి ఎప్పుడ‌ని ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. వాటికి స‌మాధానంగా త‌ర్వ‌లోనే అని చెబుతూనే ఉన్నారు.

అయితే ఇంత‌కాలం త‌న పెళ్లి విష‌యం పై సాలిడ్ ఆన్సర్ ఇవ్వ‌ని విశాల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌ను ప్రేమ పెళ్ళే చేసుకుంటాన‌ని.. అమ్మాయి కూడా రెడీగా ఉంద‌ని.. చెన్నైలో నిర్మాతల మండలి భవన నిర్మాణం పూర్తి అవ‌గానే తాను పెళ్లి చేసుకుంటాన‌ని స్పష్టం చేశారు విశాల్. అయితే ఆ అమ్మాయి ఎవ‌ర‌నేది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో విశాల్ వ‌ర‌ల‌క్ష్మినే పెళ్లి చేసుకుంటాడ‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎప్ప‌టి నుండో స్నేహం ఉంది. వ‌రల‌క్ష్మీ త‌న సోల్ మేట్ అని గ‌తంలో విశాల్ తెలిపారు. ఈ నేప‌ధ్యంలో విశాల్ పెళ్లి వ‌ర‌ల‌క్ష్మితోనా లేక వేరే అమ్మాయితోనా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments