నరేంద్ర మోడీ పాత్రలో నటించనున్న వివేక్ ఒబెరాయ్

Monday, December 23rd, 2013, 09:00:24 PM IST


బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జీవిత కథని ఆధారంగా చేసుకొని బాలీవుడ్ లో ఒక సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. దానిలో నరేంద్ర మోడీ పాత్రని వివేక్ ఒబెరాయ్ నటించనున్నాడని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి అమెరికాకు చెందిన ఒక దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో యువ నరేంద్ర మోడీగా వివేక్ ను సంప్రదించడని తెలిసింది. అయితే డిసెంబర్ 23న జరిగిన యువజన సమావేశంలో పాలోగొన్న వివేక్ ఒబెరాయ్ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్నీ తెలియజేశాడు. ఈ సినిమాకి మితేష్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్ని కుదిరితే గుజరాత్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ లోని స్టాప్ క్యాంటిన్ లో ఉద్యోగిగా, టీ స్టాల్ యజమానిగా మనం వివేక్ ను చూడవచ్చు.