ఆర్జీవీ పై వెబ్ సిరీస్…సాధ్యమయ్యే పనేనా!?

Wednesday, July 22nd, 2020, 02:52:26 AM IST


వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ స్టార్ చిత్రం పై పవన్ కళ్యాణ్ అభిమానులు పీకల దాకా కోపం తో రగిలిపోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. అయితే రామ్ గోపాల్ వర్మ పై సెటైరికల్ గా పరాన్న జీవి అంటూ కొందరు ప్రత్యేకించి ప్లాన్ ప్రకారం ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్జీవీ పై తీస్తున్న సేటరికల్ సినిమా గా ఇది నిలిచే అవకాశం ఉంది. అయితే తాజాగా మరొక వార్త ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది.

రామ్ గోపాల్ వర్మ జీవితం లో చీకటి కోణాలను చూపిస్తూ కొందరు వెబ్ సిరీస్ ప్లాన్ చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఆర్జీవీ పాత్రలో ప్రముఖ జబర్దస్త్ కమిడియన్ శకలక శంకర్ కనిపించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే నిజంగా ఈ వెబ్ సిరీస్ కార్యరూపం దాల్చితే, దీనికి అందుకు దర్శక నిర్మాతలు ఎవరు అనే దాని పై చర్చ జరుగుతుంది. సెట్స్ మీదకి ఎపుడు వెళ్తుంది అంటూ కొందరు ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు.