అరవింద్ విమర్శలకు వర్మ ఏమి సమాధానము చెప్పారంటే?

Friday, April 20th, 2018, 04:05:57 AM IST


ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం పలు మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో నేడు అల్లు అరవింద్ మాట్లాడుతూ సంచల దర్శకుడు రాంగోపాల్ వర్మ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితం వర్మ అరవింద్ మాట్లాడిన దానికి సమాధానంగా ఒక ప్రకటనను తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.‘‘పవన్‌ కల్యాణ్‌ విషయంలో అల్లు అరవింద్‌ చాలా వేగంగా స్పందించారు. శ్రీరెడ్డి విషయంలో నెల రోజులుగా చిన్న కామెంట్‌ కూడా చేయలేదు. దగ్గుబాటి సురేశ్‌తో మాట్లాడి అభిరామ్‌ విషయంలో డబ్బులు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. నేను ఇప్పిస్తానన్న రూ.5 కోట్లతో పవన్‌కు ఎలాంటి సంబంధం లేదు.

నా రొమ్ము నేనే గుద్దుకున్నాను తప్ప ఇంకెవరి రొమ్ము గుద్దలేదు. పవన్‌ ఆకాశమంత ఎత్తు ఉన్న సూపర్‌స్టార్‌, లీడర్‌. ఆయన స్థాయి తగ్గించడానికి నేనెవరని, ఎంతటివాడిని. నూటికి నూరు శాతం నేను చేసింది క్షమించరాని తప్పే. అరవింద్‌కు, పవన్‌కు, ఫ్యాన్స్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. మళ్లీ ఎప్పుడూ పవన్‌ మీద, అరవింద్‌ కుటుంబ సభ్యుల మీద నెగిటివ్‌ కామెంట్స్‌ పెట్టను’’ అని వర్మ పేర్కొన్నారు. అయితే కొందరు నెటిజన్లు వర్మ చేసిన తప్పుకు బాధపడుతున్నాడు ఆయన్ని వదిలేయమని అంటుంటే, మరి కొందరు ఇది కూడా వర్మ నాటకం లో భాగమేనని ట్వీట్స్ చేస్తున్నారు. కాగా ఆయన విడుదల చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది…..

  •  
  •  
  •  
  •  

Comments