త్రివిక్రమ్ తో విజయ్ దేవరకొండ సినిమా.. ఆగిపోయిందా ?

Wednesday, October 24th, 2018, 11:50:03 PM IST

ఏంటి షాక్ అవుతున్నారా ? మీరు వింటున్నది నిజమే !! అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఆ తరువాత ఒక్కసారిగా పాపులర్ హీరోగా మారిపోయాడు. అతడితో సినిమాలు చేసేందుకు పెద్ద దర్శకులతో పాటు నిర్మాతలు పోటీ పడ్డారు. అర్జున్ రెడ్డి విడుదల అవ్వకముందే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండు సినిమాలకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ లిస్ట్ లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నాడు ?

విజయ్ తో సినిమా చేయాలనీ త్రివిక్రమ్ కు ఓ క్రేజీ అఫర్ వచ్చిందట .. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా స్పాయిల్ అయిందని టాక్ ? దీనికి సంబంధించి కొన్ని వివరాలు తెలిసాయి. దర్శకురాలు నందిని రెడ్డి ఓ కథను రాసుకుని దర్శకుడు త్రివిక్రమ్ ని కలిసారుట. అయితే ఆ కథ విషయంలో త్రివిక్రమ్ కొన్ని సలహాలు ఇచ్చాడని, ఈ కథలో విజయ్ తో పాటు వేరే హీరోలు కూడా ఉంటారని చెప్పాడట. ఆ తరువాత త్రివిక్రమ్ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదని .. ఒకవేళ ఆ సినిమా వచ్చిఉంటే మరోలా ఉండేదని అన్నాడు ఈ సినిమాకు దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తి !!