అరవింద సమేత పాటలన్ని 04:50కే విడుదల చేయడంలో ఉన్న సీక్రెట్ ఏంటి?

Tuesday, September 25th, 2018, 07:49:33 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాయలసీమ నేపధ్యంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”.ఈ చిత్రం యొక్క టీజర్ నుంచి పాటలు వరకు ఏ ఒక్క అంశంలో కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు.అయితే చిత్రంకి సంబంధించిన పాటల విడుదల విషయాన్ని గమనించినట్లయితే ఒక ఆసక్తికరమైన అంశాన్ని మనం గుర్తించవచ్చు.

ఈ చిత్రం యొక్క పాటలన్ని విడుడలయ్యి ఇటీవలే ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి.అయితే మీరు ఈ పాటల యొక్క విడుదల సమయాన్ని పరిశీలించినట్లయితే ప్రతీ ఒక్క పాట కూడా 4 గంటల 50 నిమిషాలకే విడుదల చేస్తున్నారు.ఒక్కక్క పాటనే కాకుండా మొత్తం అన్ని పాటలను కూడా అదే సమయానికి విడుదల చేశారు.అనగనగా ఒక్క పాటని మాత్రం 4గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు.

మనం ఈ అంకెలను సరిగ్గా గమనించినట్లయితే ఈ 4 మరియు 5 లను కలిపితే 9 వస్తుంది.మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క అదృష్ట సంఖ్య కూడా తొమ్మిదే.దీనిని దృష్టిలో పెట్టుకొని పాటలు విడుదల చేస్తున్నారా అన్న సందేహం మీకు కూడా వచ్చిందా?తారక్ యొక్క కార్ నంబరును చూసుకున్నా, తన ట్విట్టర్ అకౌంటు చూసినా సరే ఈ అంకె మనకు దర్శనమిస్తుంది.ఈ పాటల విడుదలకు ఇది కూడా ఒక కారణం కావచ్చు..అంతెందుకు ఈ రోజు విడుదల చెయ్యబోతున్న “ఏడ పోయినాడో” లిరికల్ పాట కూడా 04:50 నిమిషాలకే విడుదల కాబోతుంది.మరి నేరుగా 9 గంటలకే విడుదల చేయొచ్చుగా అంటే అలా చేస్తే వారి యొక్క కిటుకుకి ప్రత్యేకత ఏమి ఉంటుంది?