షాకింగ్ : వాల్మీకి టైటిల్ మారిందా – మరి కొత్త టైటిల్ ఏంటి…?

Thursday, September 19th, 2019, 10:06:42 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం వాల్మీకి… కాగా ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుండే వాల్మీకి టైటిల్ కోసమని ఎన్నో వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. అయితే ఎక్కడా కూడా వెనక్కి తగ్గని చిత్ర బృందం శుక్రవారం నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికని సంబంధిత పనులన్నీ కూడా పూర్తీ చేసుకొని చివరికి ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి సిద్దమయింది. కానీ అంతలో ఊహించని ఒక అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. దీంతో ఎట్టకేలకు వాల్మీకి చిత్ర దర్శకనిర్మాతలు దిగిరాక తప్పలేదు. ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ ని మార్చేసి “గద్దలకొండ గణేష్‌” గా మార్చేశారు.

కాగా ఈ చిత్ర టైటిల్ ని మార్చమని చాలామంది కోరినప్పటికీ దిగిరాని చిత్ర బృందం చివరికి దిగొచ్చేలా చేసింది మాత్రం అనంతపురం ఎంపీ తలారి రంగయ్య. ఈయన కూడా వాల్మీకి టైటిల్ మార్చమని చాల డిమాండ్ చేశారు. కాగా చివరికి టైటిల్ మార్చక తప్పలేదు. కాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా కలెక్టర్ల ఆదేశాలను శిరసా వహించి చిత్ర నిర్మాతలు వాల్మీకి అనే టైటిల్ తీసేసి “గడ్డలకొండ గణేష్” గా నామకరణం చేశారు.