అటక మీద ప్రాజెక్ట్ ల గురించి పవన్ కళ్యాణ్ చెప్పాలి !

Sunday, November 20th, 2016, 03:34:15 PM IST

pawandasari
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా ప్రస్తుతం ఉన్నాడు అని చెప్పచ్చు. నిర్మాతగా కొత్త సినిమా మొదలెట్టిన కళ్యాణ్ వరసగా తన సినిమాల కోసం డేట్ లు ఇచ్చేస్తున్నాడు. అవతల పొలిటికల్ పనులు కూడా ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటూ కానిస్తున్నాడు కళ్యాణుడు. అంత హడావిడి లో కూడా సైలెంట్ అయిపోయి , అటక ఎక్కేసిన కొన్ని ప్రాజెక్ట్ లని కళ్యాణ్ చెయ్యాలి అని కొందరు ఫాన్స్ కోరుతున్నారు. చరణ్ తో పవన్ కల్యాణ్ ఓ సినిమా తీయబోతున్నాడని కొన్ని రోజుల క్రితం వినిపించింది. మెగా ఫ్యామిలీలో అల్ ఈజ్ నాట్ వెల్ అని వార్తలు వచ్చినప్పుడు మేమంతా ఒకటే అని చిరు.. పవన్.. చరణ్ కలిసి మీడియా ముందుకొచ్చారు. ఆ టైమ్ లోనే పవన్ కల్యాణ్ నిర్మాతగా చెర్రీతో మూవీ తీస్తాడనే ప్రచారం జరిగింది. ఏదో హడావుడి కూడా నడిచింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఊసే లేదు. ఈ లోగా నితిన్ ని హీరోగా పెట్టి బెస్ట్ ఫ్రెండ్స్ త్రివిక్రమ్ అండ్ పవన్ సినిమా తీసేస్తున్నారు. దాసరి
సినిమా కూడా సైలెంట్ అయిపొయింది . పవన్ కోసం కథ ఉంది అనీ వేరే డైరెక్టర్ తో సినిమా తీస్తాను దాసరి చెప్పడం పవన్ కూడా దాసరి తో ఓకే అనడం అప్పట్లో సంచలనం రేపింది. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా అటక ఎక్కేసింది.