హాట్ స్టోరి : స‌ంక్రాంతి సోగ్గ‌త్తె ఎవ‌రు?

Tuesday, January 9th, 2018, 09:31:42 PM IST

ఈ సంక్రాంతి కానుక‌గా స్టార్ హీరోల సినిమాలు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, గ‌జిని సూర్య వంటి టాప్ హీరోల సినిమాలు రిలీజ‌వుతున్నాయి. వాటితో పాటే రాజ్ త‌రుణ్ న‌టించిన రంగుల రాట్నం వార్‌లోకి వ‌చ్చింది. అయితే ఇన్ని సినిమాలు రిలీజ‌వుతున్నాయి స‌రే. సంక్రాంతి సోగ్గ‌త్తె ఎవ‌రు? అన్న చ‌ర్చ మొద‌లైంది.

ఆ కోణంలో చూస్తే మ‌ల్లూ బ్యూటీ కీర్తి సురేష్‌ని సంక్రాంతి సోగ్గ‌త్తెగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అమ్మ‌డు న‌టించిన రెండు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతున్నాయి. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌ర‌స‌న ఆజ్ఞాత‌వాసిలో, సూర్య స‌ర‌స‌న గ్యాంగ్ చిత్రంలో న‌టించింది కీర్తి. ఈ రెండు సినిమాలు రెండ్రోజుల గ్యాప్‌తో రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌నున్నాయి. ప‌వ‌న్ ఆజ్ఞాత‌వాసి జ‌న‌వ‌రి 10న‌, సూర్య గ్యాంగ్ జ‌న‌వ‌రి 12న రిలీజ‌వుతున్నాయి. ఈ రెండిటిలో కీర్తి ప్ర‌ధాన నాయిక‌. ఈ నేప‌థ్యంలో కీర్తినే సంక్రాంతి సోగ్గ‌త్తెగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. కెరీర్ ప్రారంభించిన అతి త‌క్కువ స‌మ‌యంలోనే టాప్ హీరోయిన్‌ల‌ను ప‌క్క‌కు నెట్టేసిన ట్యాలెంటెడ్ గాళ్‌గా కీర్తి గురించి చెప్పొచ్చు. టాలీవుడ్‌లో ఒక్కో క‌మిట్‌మెంట్‌కి 2కోట్లు పైగా అందుకుంటోంద‌న్న ప్ర‌చారం ఉంది. కీర్తి లైన్‌లో బోలెడ‌న్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి. కీర్తి న‌టిస్తున్న మ‌హాన‌టి అత్యంత క్రేజీగా రిలీజ్ కి రానుంది. ఇక ఈ సంక్రాంతికి అభిమానుల్ని కీర్తి అంద‌చందాలు ఓ రేంజులో అల‌రించ‌నున్నాయి.