`మా` వివాదం ప‌రిష్క‌రించిన షాడో!?

Sunday, September 2nd, 2018, 11:51:45 PM IST

మూవీ ఆర్టిస్టుల సంఘం `మా అసోసియేష‌న్‌`పైనా.. శివాజీరాజాపైనా బుర‌ద‌జ‌ల్లే ప్ర‌క్రియ మొద‌లైందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఆర్టిస్టుల సంఘం గ‌త అధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్రసాద్ ప‌ద‌వీచ్యుతుడు అయ్యాక‌, అంద‌రివాడుగా ఉన్న శివాజీ రాజాపై ఓ వ‌ర్గం క‌క్ష క‌ట్టింద‌న్న సిగ్న‌ల్స్ అందాయి. ఆ క్ర‌మంలోనే ఓ ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక విష‌పూరితంగా ప్ర‌చురించిన క‌థ‌నం టాలీవుడ్‌లో సంచ‌ల‌న‌మైంది. ఈ క‌థ‌నం సారాంశం ప్ర‌కారం.. మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్షుడు శివాజీ రాజా `మా` నిధులు మింగేశాడ‌ని, మెగా ఈవెంట్‌తో వ‌చ్చిన నిధి నుంచి కొంత దుర్వినియోగం అయ్యింద‌ని స‌ద‌రు ప‌త్రిక క‌థ‌నం వెల్ల‌డించింది. మా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న సీనియ‌ర్ న‌రేష్ ఈ త‌ప్పిదాల్ని గ్ర‌హించి ప‌రిస్థితిని అదుపు చేశార‌ని, శివాజీ రాజా ప‌ద‌విని ఊస్టింగ్ చేసి, సీనియ‌ర్ న‌రేష్‌కి క‌ట్ట‌బెట్టార‌ని క‌థ‌నంలో పేర్కొన్నారు.

అయితే దీనిపై మా అసోసియేష‌న్ వివ‌ర‌ణ ఇచ్చింది. ఎలాంటి వివాదాల్లేవ్‌. అన్నీ స‌ర్ధుకున్నాయి. ప్ర‌త్య‌ర్థులు అడిగిన అన్నిటికీ శివాజీ రాజా పూర్తి స్థాయిలో క్లారిటీనిచ్చారని తెలుస్తోంది. మా నిధులు ఎలా ఖ‌ర్చు చేసింది శివాజీరాజా వివ‌రంగా తెలిపారుట‌.. గొడ‌వ స‌ద్ధుమ‌ణిగింద‌ని మా అసోసియేష‌న్ వివ‌ర‌ణ ఇచ్చింది. అయితే అసోసియేష‌న్ హుఠాహుఠీన జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి దీనిపై చ‌ర్చించ‌డంతో ఈ క్లారిటీ వ‌చ్చిందిట‌. ఈ చ‌ర్చ‌లో మా మాజీ అధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ సీనియ‌ర్ న‌రేష్ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. అయితే ఈ వివాదాన్ని కేవ‌లం నాలుగు గంట‌ల్లోనే ప‌రిష్క‌రించుకోవ‌డం ఓ పెద్ద షాకింగ్ ట్విస్ట్‌. అయితే దీనివెన‌క ఉన్న షాడో ఎవ‌రు? అంత పెద్ద వివాదాన్ని గుట్టు చ‌ప్పుడు కాకుండా, మీడియాకి లీక్ కాకుండా ఆప‌గ‌లిగింది ఎవ‌రు? అంటే.. మెగా బాస్ చిరంజీవి అని తెలుస్తోంది. బాస్ ఈ వివాదాన్ని ముగించ‌మ‌ని హిత‌వు ప‌ల‌క‌డంతో `మా` వాళ్లు శివాజీరాజా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌ సైలెంట్ అయిపోయార‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments