సంక్రాంతి వార్ వన్ సైడ్ చేసేసింది ఎవరు.?లెట్స్ సీ..

Monday, January 13th, 2020, 12:10:06 AM IST

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి పండుగ తెలుగు సినీ వర్గాల్లో ఒక రేంజ్ లో కాక రేపింది.ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు తృటిలో ఒకే రోజు విడుదలను తప్పించి నరాలు తెగే ఉత్కంఠకు తెర తీసి ఒకరికి ఒకరు నువ్వా నేనా అన్న రేంజ్ లో బాక్సాఫీస్ మీదకు దండెత్తారు.సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు ఇద్దరూ తమ తమ చిత్రాల విడుదల తేదీలు ప్రకటించడంతోనే కొన్ని నెలల క్రితమే టాలీవుడ్ లో సంక్రాంతి ఫీవర్ మొదలయ్యిపోయింది.

అలా ఒక్క రోజు గ్యాప్ తో విడుదల చేసుకున్న ఈ ఇద్దరి చిత్రాలకు మొదటి ఆట నుంచే యూనానిమస్ టాక్ సంతరించుకుంది.మొదటి నుంచీ ఇరు చిత్ర యూనిట్ లు బలమైన నమ్మకంతోనే ఉన్నారు.అనుకున్న విధంగానే ఫలితాన్ని కూడా అందుకున్నారు.కానీ సంక్రాంతి రేస్ లో పందెం కోళ్లలా వచ్చిన ఈ రెండు చిత్రాల్లో ఫైనల్ గా మాత్రం ఒక్క సినిమాయే సిసలైన సంక్రాంతి విన్నర్ గా నిలిచేలా ఉంది.రెండింటికీ ట్రెమండ్యస్ రెస్పాన్స్ వచ్చింది.

మొదటగా సూపర్ స్టార్ మహేష్ మరియు అనీల్ రావిపూడి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం “సరిలేరు నీకెవ్వరు” చిత్రం కోసం మాట్లాడినట్టయితే భారీ అంచనాలు నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం మొదటి రోజు ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ సంతరించుకున్నారు.పెద్ద గొప్ప స్టోరీ లేకపోయినా మాంచి మాస్ ఎలిమెంట్స్ మరియు అనీల్ మార్క్ కామెడీ వంటివి ఉండడం బి సెంటర్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది.

ఇక అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కలయికలో ముచ్చటగా మూడోసారి వచ్చిన “అల వైకుంఠపురములో” చిత్రం అయితే హ్యాట్రిక్ సెంటిమెంట్ ను బద్దలు కొట్టేసి ఈ సంక్రాంతిలో మరో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.విపరీతమైన పాజిటివ్ మౌత్ టాక్ రావడం త్రివిక్రమ్ పెన్ పవర్ ఏంటో మరోసారి నిరూపించడం ఈ సినిమా చూసాక ఫ్రెష్ ఫీలింగ్ అలాగే పాటలు అతి పెద్ద ఎస్సెట్ కావడం “బి” సెంటర్ ప్రేక్షకులు సహా “ఏ” సెంటర్ ఆడియన్స్ కు కూడా మొదటి ఆట నుంచే విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ అంశాల మూలానా “సరిలేరు నీకెవ్వరు” కంటే “అల వైకుంఠపురములో” చిత్రానికి లాంగ్ రన్ లో సేఫ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో రెండు బ్లాక్ బస్టర్ సంక్రాంతి చిత్రాల్లో గురూజీ మరియు బన్నీలు చేసిన మ్యాజిక్ మాత్రం ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి ఇవ్వడం ఖాయం.ఫైనల్ గా ఈ సంక్రాంతి వార్ ను “అల వైకుంఠపురములో” టీం తమ వైపుకు తిప్పుకున్నారు.